డాలర్ శేషాద్రి, అసలు పేరు పాల శేషాద్రి. తిరుమలలో లో జన్మించిన డాల్లర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి. అతని పూర్వీకులు తమిళనాడులోని కంచికి చెందిన వారు. శేషాద్రి తండ్రి తిరుమల ఆలయంలో గుమస్తాగా విధులు నిర్వర్తించాడు. శేషాద్రి తిరుమలలో పుట్టి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసాడు. అప్పట్లోనే పీజీ చేసాడు. తనది జాతక చక్రంలోని మేషరాశి కావడంతో మేక బొమ్మను డాలర్‌గా మెడలో ధరించడం వల్ల డాలర్ శేషాద్రిగా పేరు స్థిరపడి పోయింది.[1] అలాగే గతంలో తిరుమల ఆలయంలో శ్రీవారి బంగారు రూపులు (డాలర్లు) అమ్మేవాడు. ఆ విక్రయ విభాగం అతని ఆధ్వర్యంలో నడిచేది. కాబట్టే అతనికి డాలర్ శేషాద్రి అనే పేరు వచ్చిందనేది మరొక కారణంగా చెప్తారు. జనవరి 26న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఉత్తర పారుపత్తేధారుగా విధుల్లో చేరాడు. అప్పటి నుంచి తన తుది శ్వాస వరకూ స్వామివారి సేవలోనే తరించాడు. జులై 31న ఉద్యోగ విరమణ చేసి, ఆ తర్వాత ఔట్ సోర్సింగ్ కింద ఆలయ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా కొనసాగుతూ వచ్చాడు. ఈ నాలుగు దశాబ్దాల కాలం పైబడి తిరుమల ఆలయంలో అనేక పదవులు నిర్వహించాడు.
వ సంవత్సరం తిరుమలలో పాల శేషాద్రి జన్మించాడు.అతని పూర్వీకులు తమిళనాడులోని కంచికి చెందిన వారు. అతని తండ్రి తిరుమల ఆలయంలో గుమస్తాగా విధులు నిర్వర్తించాడు. శేషాద్రి విద్యాభ్యాసం తిరుపతిలోనే పూర్తి చేసారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అతను లో టీటీడీలో చేరాడు. డాలర్ శేషాద్రికి భార్య, ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. [2]
కార్తిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖపట్నం వెళ్ళిన అతను నవంబరు 29న గుండెపోటుతో మృతి చెందాడు.[3]